కాకరకాయ పొడి

ABN , First Publish Date - 2022-03-16T18:48:40+05:30 IST

మినప్పప్పు- స్పూను, శెనగలు- స్పూను, ఎండు మిర్చి- అయిదు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు,

కాకరకాయ పొడి

కావలసిన పదార్థాలు: మినప్పప్పు- స్పూను, శెనగలు- స్పూను, ఎండు మిర్చి- అయిదు, వెల్లుల్లి రెబ్బలు- అయిదు, ధనియాలు- అర స్పూను, చింతపండు- కాస్త, కాకరకాయలు- నాలుగు, ఉప్పు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా కాకరకాయల్ని గుండ్రంగా కట్‌ చేసుకోవాలి. పాన్‌లో కాస్త నూనె వేసి ఈ ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి. మినప్పప్పు, శనగలు, ఎండు మిర్చి, వెల్లుల్లి, ధనియాలు, చింత పండును వేయించుకుని చల్లారాక మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. దీంట్లో వేయించిన కాకరకాయ ముక్కలు, ఉప్పు కూడా కలిపి మిక్సీ తిప్పితే కాకరకాయ పొడి సిద్ధం.

Updated Date - 2022-03-16T18:48:40+05:30 IST