కాకాణి విల్లాలో శవం

ABN , First Publish Date - 2022-04-18T08:17:50+05:30 IST

కాకాణి విల్లాలో శవం

కాకాణి విల్లాలో శవం

విద్యుత్‌ షాక్‌తో చనిపోయాడన్న పోలీసులు

శనివారం చనిపోతే 24 గంటలపాటు గోప్యత

హత్య చేశారని బంధువుల ఆరోపణ

చోరీ చేసిన వ్యక్తితో కలిసి మంత్రి వద్దకు వచ్చినప్పుడే ఈ హత్య: టీడీపీ

మృతుడి కుటుంబీకులతో మంత్రి పీఏ బేరాలు!

మధ్యవర్తులుగా వైసీపీ నేతలు.. 6 లక్షలకు డీల్‌?  


మంగళగిరి, ఏప్రిల్‌ 17: మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి కి చెందిన విల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితి లో మృతిచెందాడు. శనివారం ఉదయం మరణించగా, ఆదివా రం ఉదయం వరకు గోప్యంగా ఉంచారు. విద్యుత్‌ షాక్‌తో చనిపోయాడని పోలీసులు చెబుతుండగా, హత్య చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. మంగళగిరి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళగిరికి చెందిన షేక్‌ మొహమ్మద్‌(19) పట్టణంలోనే యూసూబ్‌కు చెందిన ఏసీ మెకానిక్‌ షాపులో పని చేస్తున్నాడు. ద్వారకా రెయిన్‌ట్రీపార్కులోని ఓ విల్లాలో ఎయిర్‌ కూలర్‌ బిగించేందుకు రావాలని యూసూబ్‌కు కబురొచ్చింది. యూసూబ్‌.. మొహమ్మద్‌ను పంపించాడు. మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి విల్లాలో ఏసీ బిగిస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి మొహమ్మద్‌ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అయితే, మొహమ్మద్‌ మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్‌ షాక్‌తో చనిపో తే మరుసటి రోజు వరకూ గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మొహమ్మద్‌ను హత్య చేసి, విద్యుత్‌ షాక్‌తో మృతి చెందినట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేపట్టేందుకు బంధువులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మం త్రి పీఏ రంగప్రవేశం చేసి స్థానిక వైసీపీ నేతల సాయంతో మృతుడి కుటుంబీకులతో బేరాలకు దిగిన ట్టు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరించిన స్థా నిక వైసీపీ నేతలు పలు విధాలుగా నచ్చజెప్పడంతో మృతుడి కుటుంబీకులు మొత్తబడ్డారు. రూ.12 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టగా.. చివరకు 6 లక్షలు ఇచ్చేందుకు వైసీపీ నేతలు ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. మంత్రి కాకా ణి 3 లక్షలు, మెకానిక్‌ షాపు యజమాని షేక్‌ యూ సూబ్‌ 3 లక్షలు ఇచ్చేలా డీల్‌ కుదిరినట్టు సమాచారం. మంగళగిరి రూరల్‌ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎన్నారై జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. రాజీ కుదరడానికి ముందు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మృతుడి కుటుంబీకులు అంగీకరించలేదు.

Updated Date - 2022-04-18T08:17:50+05:30 IST