Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కాజూ మసాలా

కాజూ మసాలా

కావలసిన పదార్థాలు: జీడిపప్పు - ముప్పావు కప్పు, ఉల్లి తరుగు - అర కప్పు, టొమాటో - మూడు, అల్లం వెల్లుల్లి పేస్టు -స్పూను, నెయ్యి- స్పూను, బిర్యానీ ఆకు - ఒకటి, దాల్చిన చెక్క- కాస్త, జిలకర- స్పూను, కారం- స్పూను, మీగడ - పావు స్పూను, గరం మసాలా- అర స్పూను, కొత్తిమీర తురుము- స్పూను, నీళ్లు, నూనె, ఉప్పు - తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా జీడిపప్పును వేయించి పెట్టుకోవాలి. టొమాటో ముక్కలు, పావు కప్పు ఉల్లి ముక్కలు కలిపి పేస్టు చేసుకోవాలి.  పాన్‌లో నూనె వేసి జిలకర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేయించాలి. నిమిషం తరవాత మిగతా ఉల్లిముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు ఆగాలి. ఆ తరవాత ఉల్లి, టొమాటో మిశ్రమాన్ని కలిపాలి. కాస్త దగ్గరగా వచ్చాక మంట తగ్గించి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు జతచేయాలి. రెండు నిమిషాల తరవాత కప్పు నీళ్లు, పావు స్పూను మీగడ వేసి బాగా కలపాలి. దీంట్లోనే వేయించిన జీడిపప్పు కూడా వేసి అంతా కలిపి  అయిదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. గరం మసాలా కూడా కలిపి నిమిషం తరవాత పొయ్యి కట్టేయాలి. పైన కొత్తిమీర తురుము చల్లితే కాజూ మసాలా ఘుమఘుమలాడుతుంది.

మామిడికాయ - పెరుగు పులుసుమామిడికాయ - పెరుగు పులుసుములక్కాడల కూరములక్కాడల కూరక్యాబేజీ చనా దాల్‌క్యాబేజీ చనా దాల్‌శ్రీలంక వంకాయకూరశ్రీలంక వంకాయకూరఆవాల ఆకుల కర్రీ ఆవాల ఆకుల కర్రీ ఆలూ మేతీఆలూ మేతీసాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌మేథీ బాజీమేథీ బాజీకరివేపాకు చట్నీకరివేపాకు చట్నీకరివేపాకు కర్రీకరివేపాకు కర్రీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.