కాజూ బర్ఫీ

ABN , First Publish Date - 2021-02-18T20:59:50+05:30 IST

ముందుగా మిక్సీలో జీడిపప్పు వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. పేస్టుగా కానీ జారుగా కానీ ఉండకుండా జాగ్రత్తపడాలి. ఓ మందపాటి కడాయిలో

కాజూ బర్ఫీ

కావలసిన పదార్థాలు

జీడిపప్పు: ఒక కప్పు, పంచదార: సగం కప్పు, నీళ్లు: అయిదు స్పూన్లు, నెయ్యి: ఒక స్పూను


తయారుచేసే విధానం: ముందుగా మిక్సీలో జీడిపప్పు వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. పేస్టుగా కానీ జారుగా కానీ ఉండకుండా జాగ్రత్తపడాలి. ఓ మందపాటి కడాయిలో పంచదార, నీళ్లు వేసి వేడిచేయాలి. పంచదార కరగగానే జీడిపప్పు పొడి వేసి కలుపుతూ ఉండాలి. చిక్కబడ్డాక నెయ్యి కూడా వేసి కలపాలి. మొత్తం కలిసిపోయి దగ్గరవుతుంది. నెయ్యి పూసిన ఓ ప్లేట్‌లో మిశ్రమాన్ని వెయ్యాలి. దాని మీద ఓ బటర్‌ పేపర్‌ పెట్టి పూరీలా వత్తాలి. కాస్త చల్లారిన తరవాత చాకుతో ముక్కలుగా కోస్తే బర్ఫీ రెడీ. 

Updated Date - 2021-02-18T20:59:50+05:30 IST