Abn logo
Oct 30 2020 @ 10:55AM

పెళ్లైన వెంటనే షూటింగ్‌కు కాజల్?

Kaakateeya

చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. తన ప్రేమికుడు గౌతమ్ కిచ్లూను కాజల్ ఈ రోజు (శుక్రవారం) వివాహం చేసుకోబోతోంది. వివాహం జరిగిన కొద్ది రోజులకే కాజల్ సినిమా షూటింగ్‌కు హాజరు కాబోతున్నట్టు సమాచారం. 


నవంబర్ రెండో వారం నుంచి `ఆచార్య` షూటింగ్‌కు కాజల్ హాజరు కాబోతోందట. డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న `ఆచార్య`లో చిరుకు జోడీగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ 3 నుంచి పున:ప్రారంభించబోతున్నారట. కాజల్ మాత్రం నవంబర్ రెండో వారం నుంచి షూటింగ్‌కు హాజరవుతుందట. 

Advertisement
Advertisement