Sep 25 2021 @ 20:23PM

కాజల్ ప్రెగ్నెంటా..? అందుకే నాగ్ సినిమా నుండి తప్పుకుందా?

పెళ్లి తర్వాత కూడా భర్త ప్రోత్సాహంతో సినిమాలు చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేసిన కాజల్, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది ఘోస్ట్’ అనే చిత్రంలో కింగ్ నాగార్జున సరసన నటించేందుకు ఓకే చేసింది. ఈ చిత్ర షూటింగ్ కూడా ఈ మధ్యే మొదలైంది. ఈ సినిమాలో కాజల్‌ రా ఏజెంట్‌గా కనిపించనుందని, ఇందుకోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటుందనేలా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె గురించి సినీ సర్కిల్స్‌లో సరికొత్తగా వార్తలు మొదలయ్యాయి. 


ప్రస్తుతం కాజల్ ‘ది ఘోస్ట్’ చిత్రం నుండి తప్పుకుందని, అందుకు కారణం ఆమె ప్రెగ్నెంట్ అనేలా ఇండస్ట్రీలో రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె స్థానంలో ఇలియానా లేదంటే త్రిషని తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా కూడా రూమర్స్ వినవచ్చాయి. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ని సంప్రదించారని, ఆమె నిర్ణయం కోసం మేకర్స్ వేచి చూస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. కాగా, కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయంపై ఆమె కానీ, ఆమె భర్త గౌతమ్ కానీ ఇంతవరకు స్పందించలేదు.