Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 11:20:56 IST

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ‘బాహుబలి’ ఐకానిక్ సీన్‌ని రీ క్రియేట్ చేసిన కాజల్.. మా డేడికేషన్ అదంటూ..

twitter-iconwatsapp-iconfb-icon

టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటి కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). కెరీర్‌లో వరుసగా స్టార్స్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్‌ పిక్స్‌లో ఉండగానే కొన్నేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఈ జంటకి ఇటీవలే ఓ కొడుకు జన్మించాడు. అతనికి నీల్ కిచ్లూ (Neil Kitchlu) అని పేరు పెట్టుకున్నారు. తన జీవితంలో మాతృత్వం అనే దశని ఆస్వాదిస్తోంది.


అయితే.. కాజల్ ఇప్పటివరకూ కొడుకు ముఖాన్ని రివీల్ చేయలేదు. అప్పుడప్పుడూ కొడుకుకి సంబంధించిన కొన్ని గ్లింప్స్‌లను కూడా సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ తాజాగా ఎస్‌ఎస్ రాజమౌళి తీసిన ‘బాహుబలి’ ఐకానిక్ సీనైనా.. కట్టప్ప తలపై బాహుబలి కాలు పెట్టే సీన్‌ని కొడుకుతో రీక్రియేట్ చేసింది. దానికి సంబంధించిన పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో కాజల్ షేర్ చేసింది. దానికి.. ‘ఎస్‌ఎస్ రాజమౌళి సార్. ఇది నీల్, నా డేడికేషన్. అందరిలా మేము కూడా ఎలా ఇన్‌స్పైర్ కాకుండా ఉంటాం’ అని రాసుకొచ్చింది. అలాగే ఈ స్టోరీలో.. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, కార్తీకేయని ట్యాగ్ చేసింది.


కాగా.. ఈ బ్యూటీ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా చేస్తున్న ఇండియన్ 2 (తెలుగుతో భారతీయుడు 2)లో నటిస్తోంది. పలు కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. సమస్యలు అన్ని తీరి.. త్వరలోనే ఈ సినిమా పట్టాలేక్కే అవకాశం ఉంది.

Kajal Aggarwal: కొడుకుతో కలిసి బాహుబలి ఐకానిక్ సీన్‌ని రీ క్రియేట్ చేసిన కాజల్.. మా డేడికేషన్ అదంటూ..


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement