స్వస్వరూప స్థితియే కైవల్యముక్తి

ABN , First Publish Date - 2020-11-13T09:51:25+05:30 IST

నిషత్తు’ చెబుతోంది. అందులో ‘విదేహ కైవల్యం’ అనేది జీవాత్మ యొక్క స్వస్వరూప స్థితియే. ఆ స్థితిని సాధించడమే పురుషార్థం. అదే ముక్తి - మోక్షం- కైవల్యం - పరమపదం.

స్వస్వరూప స్థితియే కైవల్యముక్తి

మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయన్తః పరస్పరమ్‌

కథయన్తశ్చ మాం నిత్యం, తుష్యన్తి చ రమన్తి చ


అని గీతావాక్యం. ‘నాయందే హృదయాన్ని నిలిపేవారు, తమ ప్రాణాన్ని నాలోనే నిలిపేవారు, ఎల్లప్పుడూ నా కథలనే బోధిస్తారు. నా గుణాలను గానం చేస్తూ సంతోషాన్ని పొందుతారు. నిరంతరం నాలోనే ఆనందిస్తారు’ అని దీని అర్థం. ఇలా మనసులోనూ, మాటలోనూ, క్రియలోనూ పరమేశ్వరుని ధ్యానాన్నే చేస్తూ, తదేకమైన బుద్ధిలో ఉండేవారు ముక్తినొందుతారు. సంసారం దిశగా వెళుతున్న ఈ ‘జీవన నావని’ భగవంతుని వైపునకుతిప్పి ఒడ్డుకు చేర్చడమే ముక్తి. ‘కైవల్యముక్తి రేకైవ పారమార్థిక రూపిణీ’’ అని ‘ముక్తికోప


సారూప్యం తవ పూజనే, శివ! మహాదేవేతి సంకీర్తనే

సామీప్యం, శివభక్తిధుర్య జనతా సాంగత్య సంభాషణే

సాలోక్యం చ చరాచరాత్మక తను ధ్యానే భవానీ పతే

సాయుజ్యం, మమ సిద్ధ, మత్రభవతి స్వామిన్‌ కృతార్థో స్మ్యహమ్

నిషత్తు’ చెబుతోంది. అందులో ‘విదేహ కైవల్యం’ అనేది జీవాత్మ యొక్క స్వస్వరూప స్థితియే. ఆ స్థితిని సాధించడమే పురుషార్థం. అదే ముక్తి - మోక్షం- కైవల్యం - పరమపదం. 


అని శ్రీ శంకరుల వారి ‘శివానందలహరి’ శ్లోకం. ‘‘ఓ భవానీ పతివగు సదాశివ! కరుణామయుడవగు నీ పూజ చేసేటప్పుడు నాకు నీవు ‘సారూప్యం’ అనే మోక్షానిస్తున్నావు. దేవా! నిన్ను నేను ‘మహాదేవా’! అని సంకీర్తనము చేసేటప్పుడు నీ ‘సామీప్య’ భక్తిని ఇస్తున్నావు. స్వామీ! నీ పరమభక్తులతో సంభాషించేటప్పుడు ‘సాలోక్య’మనే ముక్తినిస్తున్నావు. ప్రభూ! చరాచరములందు సర్వత్రా వ్యాపించియున్న నీ దివ్యరూప ధ్యానం చేసేటప్పుడు ‘సాయుజ్య’ ముక్తిని ఇస్తున్నావు’’ అని దీని భావం.


మోక్షం నాలుగు విధాలని ‘ముక్తికోపనిషత్‌’ చెబుతోంది. ఈ నాలుగూ‘భగవంతుని పూజ, సంకీర్తనం, భగవద్భక్తులతో సంభాషణ, ధ్యానం వల్ల ఈ లోకంలోనే సిద్ధిస్తాయని చెప్పబడింది. ఆంజనేయుడు ముక్తిని గురించి తెలుపమని శ్రీరాముని కోరగా.. చతుర్విధ ముక్తులను గురించి చెప్పాడు. వీటికంటే గొప్పది ‘కైవల్యముక్తి’. అదే జీవన్ముక్తి. మోక్షమనగా బంధ విముక్తి. కైవల్యమనగా తానే బ్రహ్మం కావడం. స్వస్వరూప జ్ఞానం మోక్షమని, సదాశివుని పూజించడం వల్ల ఇక్కడే మోక్షం సిద్ధిస్తుందని శ్రీ శంకరులు తెలుపుతున్నారు.





 మేఘశ్యామ (ఈమని), 8332931376


Updated Date - 2020-11-13T09:51:25+05:30 IST