Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళితబంధు, మూడెకరాల భూమిని పంపిణీ చేయాలి

- ఓయూ ప్రొఫెసర్‌ కాసిం

తొర్రూరు రూరల్‌, నవంబరు 27 : ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మూడెకరాల భూమి, దళితబంధు పథకాన్ని తక్షణమే అమలు పర్చాలని ఓయూ ప్రొఫెసర్‌ చింతకింది కాసిం డిమాండ్‌ చేశారు. ఫత్తేపురంలో అంబేద్కర్‌ పూలే వారసుల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు, రచయిత, ప్రజాకవి వెలిశ్యాల జయరాజ్‌, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివా్‌సతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాసిం మాట్లాడుతూ బడు గు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరు ముందుకుసాగాలన్నారు. 1996 సంవత్సరం నుంచి ఉన్న సుమారు లక్ష బ్యాక్‌లాక్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో 98శాతం భూమిలేని వారు ఉన్నారని, వారికి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నవిధంగా మూడు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు.

  ప్రజాకవి జయరాజ్‌ మాట్లాడుతూ హేతువాదం, కులనిర్మూలకు పాటుపడి జీవన విధాన నేర్పించేది బౌద్దమని చాటిచెప్పిన అంబేద్కర్‌ విశ్వప్రతినిధి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గూడెల్లి సోమనర్సమ్మ వెంకన్న, ఉప సర్పంచ్‌ మల్లారెడ్డి, వైస్‌ఎంపీపీ ఇట్టె శ్యాంసుందర్‌ రెడ్డి, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్‌, సైదులు, గుండాల నర్సయ్య, నలుమాల ప్రమోద్‌, నాగన్న, ఇండ్ల వెంకటేశ్వర్లు, గిద్దె రామనర్సయ్య, సోమారపు అయిలయ్య, రాయిశెట్టి వెంకన్న, ఉపేందర్‌, నాగన్న, విగ్రహదాత గూడెల్లి వెంకన్న, కిరణ్‌, సాయి, అంబేద్కర్‌ పూలే వారసుల కమిటీ ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement