Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరట్టు ఉత్సవానికి ముస్తాబైన కడ్తాల్‌ అయ్యప్ప ఆలయం

సోన్‌, డిసెంబరు 4 : మండలంలోని కడ్తాల్‌ గ్రామ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఆదివారం ఆరట్టు ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ గురు స్వామి నర్సారెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలకు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉమ్మడి జిల్లాలో పేరు పొందిన ఈ ఆలయంలో జిల్లా నుంచే కాకుం డా నిజామాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. శబరిమలలో నిర్వహించే ఆరట్టు ఉత్సవాల మాదిరే ఇక్కడ వేడుకలు నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతసేవతో ప్రారంభించి అష్టాభిషేకంతో విశేష అలంకరణ చేస్తారు. తర్వాత ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో గ్రామవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం మాలధారణ భక్తులు పాద యాత్రగా సోన్‌ గోదావరికి చేరుకుంటారు. నదిలో ఉత్సవ విగ్రహాలకు మంగ ళస్నానం, పుష్పాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం, తదితర పూజా కార్య క్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం స్వామివారికి ఉంజల్‌సేవ, భజనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇట్టి ఉత్సవానికి భక్తులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని శ్రీ ధర్మశాస్త్ర ట్రస్ట్‌ సభ్యులు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement