కడప: కుటుంబానికి ప్రాణహానీ ఉందంటూ మహిళ సెల్ఫీ వీడియో

ABN , First Publish Date - 2021-12-20T18:16:26+05:30 IST

జిల్లాలోని ప్రొద్దుటూరులో నూర్జా హాన్ అనే మహిళ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.

కడప: కుటుంబానికి ప్రాణహానీ ఉందంటూ మహిళ సెల్ఫీ వీడియో

కడప: జిల్లాలోని ప్రొద్దుటూరులో నూర్జా హాన్ అనే మహిళ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ  నూర్జహాన్ అనే మహిళ సెల్పీ వీడియోలో కన్నీటి పర్యంతమైంది. తన భర్తకు ఆయన చెల్లెళ్ళు..తమ్ముడితో ఆస్తి తగాదాలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో తన భర్తకు యాక్సిడెంట్ చెయ్యడంతో నడవలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు. రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్ళిన తన కుమారుడిని కొట్డడంతో గాయాలయ్యాయని నూర్జహాన్ అన్నారు. తమకు న్యాయం చేయాలని సేల్ఫీ వీడియోలో నూర్జహాన్ ఆవేదన చెందారు. సేల్ఫీ వీడియోపై స్పందించిన పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. 

.


Updated Date - 2021-12-20T18:16:26+05:30 IST