కడియమ్మవాగును కాపాడాలి

ABN , First Publish Date - 2021-05-06T09:07:17+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తవ్వుతున్న మట్టి, కొడుతున్న బండరాళ్లను మూలలంక వద్ద యథేచ్ఛగా పడేస్తున్నారని..

కడియమ్మవాగును కాపాడాలి

మూలలంక డంపింగ్‌ వద్ద రక్షణ గోడ

రాళ్లు, మట్టి వేసే సమయంలో ధూళి రేగకుండా నీళ్లు చల్లాలి

పోలవరం డంపింగ్‌ యార్డుపై ఎన్‌జీటీకి జస్టిస్‌ శేషశయనారెడ్డి కమిటీ నివేదిక


అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తవ్వుతున్న మట్టి, కొడుతున్న బండరాళ్లను మూలలంక వద్ద యథేచ్ఛగా పడేస్తున్నారని.. దీనివల్ల పర్వతాల్లో పుట్టిన సహజమైన కడియమ్మవాగు కనుమరుగు కాకుండా సంరక్షించాలని జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి కమిటీ సూచించింది.  తవ్వి పడేస్తున్న మట్టి, రాళ్లగుట్టలను మూలలంక వద్ద పడేయడం వల్ల సమీప గ్రామస్థులు కాలుష్య కాటుకు గురవుతున్నారని, లారీలు పెద్దసంఖ్యలో తిరగడం వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతోందంటూ కొందరు పర్యావరణవేత్తలు ఫిర్యాదు చేశారు. దీంతో నిజానిజాలు తెలుసుకునేందుకు.. పర్యావరణ, అటవీ పరిరక్షణపై అధ్యయనం కోసం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రొఫెసర్‌ శ్రీహర్ష (ఐఐటీ, ఢిల్లీ), ప్రొఫెసర్‌ టి.శశిధర్‌ (ఐఐటీ కంది), ఉదకమండలం ఐసీఎఆర్‌ ఐఐఎ్‌సడబ్ల్యూసీ రీసెర్చ్‌ సెంటర్‌ ముఖ్య శాస్త్రవేత్త ఎస్‌.మణివణ్ణన్‌, చెన్నై సీపీసీబీ ప్రాంతీయ డైరెక్టర్‌ హెచ్‌డీ వరలక్ష్మి, విజయవాడ అటవీ పర్యావరణ శాఖ సైంటిస్టు సురేశ్‌బాబు పసుపులేటి ఉన్నారు. ఈ బృందం మార్చి 31న పోలవరం డంపింగ్‌ యార్డు ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. 12 సిఫారసులతో కూడిన అధ్యయన నివేదికను ఎన్‌జీటీకి సమర్పించింది.


కమిటీ సూచనలివీ..

  • డంపింగ్‌ యార్డు కోసం 203.74 ఎకరాలను కేటాయించి.. రక్షణ గోడను నిర్మించాలి.
  • యార్డు వల్ల ధూళి రేగకుండా మట్టి, రాళ్ల గుట్టలపై నీళ్లు చల్లాలి.
  • డంపింగ్‌ మట్టి, ఖనిజాల అవశేషాల కారణంగా నీరు, గాలి కలుషితం కాకుండా శాస్త్రీయ విధానం అవలంబించాలి.
  • సహజసిద్ధంగా ఉన్న కడియమ్మ వాగులోకి మురుగునీరు చేరకుండా వాగుకు ఇరుపక్కలా కాలువలు నిర్మించాలి.
  • డంపింగ్‌ యార్డు ప్రాంతంలో అడవిని వృదిఽ్ధ చేసేలా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి.
  • కొండ వాలు నుంచి యార్డు వరకూ గడ్డిని పెంచడం ద్వారా ధూళి ఎగసిపడకుండా నివారించవచ్చు.
  • యార్డుకు ఉత్తర దిక్కున కొండ చరియలు ఉన్నందున అడవిని అభివృది్ధ చేసే పనులు చేపట్టాలి.
  • పోలవరం నిర్మాణానికి కంకర తయారీ కోసం స్టోన్‌క్రషర్‌ వినియోగం నిలిపివేయాలి.

Updated Date - 2021-05-06T09:07:17+05:30 IST