దానయ్యకు మొక్కను అందచేస్తున్న కొత్తూరి బాలనాగేశ్వరరావు, గంగుమళ్ళ తాతాజీ
కడియం, జనవరి 16: కడియం మండలం కడియపులంక గంగుమళ్ళ సత్యనారాయణ నర్సరీని ఆదివారం ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సందర్శించారు. ఆయనకు నర్సరీ రైతు గంగుమళ్ళ తాతాజీ స్వాగతం పలికారు. నర్సరీలో వివిధ రకాల మొక్కలను చూశారు. కొన్ని రకాల మొక్కలను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో కొత్తూరి బాలనాగేశ్వరరావు, రెడ్డి తదితరులున్నారు.