కాడి ఊయలాయే.. బాబు నిదురపోయే..!

ABN , First Publish Date - 2022-08-20T05:47:24+05:30 IST

‘లాలిజో..లాలీజో...ఊరుకో పాపాయి’ అంటూ తన కాడిమానుకు ఊయల కట్టి...

కాడి ఊయలాయే..  బాబు నిదురపోయే..!

పెద్దకడుబూరు, ఆగస్టు 19: ‘లాలిజో..లాలీజో...ఊరుకో పాపాయి’ అంటూ తన కాడిమానుకు ఊయల కట్టి...అందులో బిడ్డను నిద్రపుచ్చారా తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండల పరిధిలోని కంబళదిన్నెకు చెందిన రైతు కృష్ణ, సావిత్రి దంపతులకు ఏడాదిన్నర వయసు గల కుమారుడు ఉన్నాడు. బిడ్డను ఇంట్లో ఉంచితే సాకేవారు లేరు. అలాగని భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడకపోతే కడుపు నిండదు. దీంతో చేసేది లేక తమ తో పాటు చిన్నారిని పొలానికి తీసుకెళ్లారు. కుమారుడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో ఆ తల్లిదండ్రులు జెంతి పడుతున్న కాడిమానుకు ఊయల కట్టి...అందులో బిడ్డను నిద్రపుచ్చారు.  


Updated Date - 2022-08-20T05:47:24+05:30 IST