కడెం ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద...16 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-22T19:22:29+05:30 IST

భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 16 వరద గేట్లను ఎత్తివేశారు.

కడెం ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద...16 గేట్లు ఎత్తివేత

నిర్మల్: భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 16 వరద గేట్లను ఎత్తివేశారు. దాదాపు 1,92,260 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,80,493 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం  700  అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 696.125 ఆడుగులకు చేరింది. గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో గోదావరి దిగువ ప్రాంతాల  ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Updated Date - 2021-07-22T19:22:29+05:30 IST