Kadem project: కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు

ABN , First Publish Date - 2022-08-04T13:14:56+05:30 IST

గత కొద్దిరోజుల కితం కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు (Kadem project) గేట్లకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు కొనసాగుతున్నాయి.

Kadem project: కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు

నిర్మల్‌: గత కొద్దిరోజుల కితం కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు (Kadem project) గేట్లకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన స్పెషల్‌ టెక్నికల్‌ టీం రాత్రింబవళ్లు ప్రాజెక్టు వద్దే తిష్ఠ వేసి గేట్లకు, కౌంటర్‌వేటర్‌ల మరమ్మతులను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 18 గేట్లు వరద ప్రవాహానికి దెబ్బతిన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం నష్టం అంచనా రూ.7 కోట్లకు పైనే ఉంది. అయితే ప్రాజెక్టు గేట్లు కిందికి దిగకపోవడంతో వరదసమయంలో ముప్పు వెంటాడింది. ఓదశలో వరదప్రవాహం ఉధృతికారణంగా ప్రాజెక్టు కొట్టుకుపోవచ్చని సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అధికారులు వరద ప్రవాహం ధాటి నుంచి ప్రాజెక్టును రక్షించే విషయంలో చేతులేత్తేశారు. మొత్తంగేట్లు కిందికి దిగని కారణంగా ఇప్పటి వరకు 40 టీఎంసీలకు పైగా వరద నీరు గోదావరి పాలైంది. 


అయితే హైదరాబాద్‌కు చెందిన 15మందితో కూడిన టెక్నికల్‌ బృందం ఆపరేషన్‌ అండ్‌ మెయిన్‌టెనెన్స్‌ నిధులతో మరమ్మతులు కొనసాగిస్తోంది. 15మందితో కూడిన టెక్నికల్‌ బృందం ఆపరేషన్‌ అండ్‌ మెయిన్‌టెనెన్స్‌ నిధులతో మరమ్మతులు కొనసాగిస్తోంది. ప్రాజెక్టు రెండోగేటు, మూడోగేటుకు సంబంధించి కౌంటర్‌వేటర్‌లు వరద ఉధృతికి పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే వరదనీటిలో మునిగి 9 జర్మనీగేట్లకు నష్టం వా టిల్లింది. ఏడు ఇండియన్‌గేట్లు కూడా చెడిపోయాయి. ప్రస్తుతం జర్మనీ, ఇండియన్‌గేట్లకు మరమ్మతులు కొనసాగిస్తున్నారు.


Updated Date - 2022-08-04T13:14:56+05:30 IST