గెలుపొందిన కడప మాస్టర్స్ జట్టు
కడప మారుతీనగర్ జనవరి26: గోవాలో జరిగిన సీనియర్ టి-20 క్రికెట్ కప్ పోటీలో ఉస్మానాబాద్ జట్టుపై కడప మాస్టర్స్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సా ధించింది. బుధవారం నిర్వహిం చిన పోటీలో టాస్ గెలిచిన ఉస్మానాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎం చుకోగా కడప మాస్టర్స్ జట్టు బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్ల లో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఇందులో సహబుద్దీన్ 45 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన ఉస్మానాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఇందులో సురే్‌షసింగ్ 32 పరుగులు చేశారు.