Abn logo
Sep 19 2020 @ 07:46AM

కడపలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు..

Kaakateeya

కడప: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కడపలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలో కుంటలు, చెరువులు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వరద కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గండికోట ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పెరగడంతో ముంపు ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement