కడప రైల్వేస్టేషన్‌కు జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2020-12-05T05:41:13+05:30 IST

కడప రైల్వేస్టేషన్‌కు జాతీయ స్థాయిలో బెస్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం అవార్డు వచ్చినట్లు డీఎంఓ డాక ్టర్‌ శ్రీనివాసులు తెలిపారు.

కడప రైల్వేస్టేషన్‌కు జాతీయ అవార్డు
కడప రైల్వేస్టేషన

కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 4: కడప రైల్వేస్టేషన్‌కు జాతీయ స్థాయిలో బెస్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం అవార్డు వచ్చినట్లు డీఎంఓ డాక ్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. కడప రైల్వేస్టేషన్‌ మేనేజరు చాంబరులో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం దేశవ్యాప్తంగా ఎన్విరాన్‌మెంటు మేనేజ్‌మెంటు సిస్టం ఆడిట్‌ నిర్వహించిందన్నారు. ప్రివిజన్‌ ఆఫ్‌ పర్మిసె్‌సలో భాగంగా ఎంక్వయిరీ టికెట్‌ సిస్టం, వసతి, తినుబండారాలు, స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రతపై ఆడిట్‌ చేసినట్లు తెలిపారు. గుంతకల్లు డివిజన్‌ పరిధిలో 14 రైల్వేస్టేషన్లు బెస్ట్‌ రైల్వేస్టేషన్లుగా ఎంపికయ్యాయని అందులో కడప ఉండడం సంతోషకరమన్నారు. ఈ విజయం ఏ ఒక్కరి సొంతం కాదని, సమష్టి కృషితో సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీసీఐ జి.అమర్‌నాధ్‌, ట్రాఫిక్‌ ఇనస్పెక్టర్‌ బీఎన్‌ రెడ్డి, స్టేషన్‌ మేనేజరు ఎల్‌వీ మోహనరెడ్డి, సీపీడబ్ల్యూఐ శ్రీనివాసులరెడ్డి, టీపీఐ మధుసూదన్‌రావు, ఈఈ మోహన్‌రెడ్డి, హెల్త్‌ ఇనస్పెక్టర్‌ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:41:13+05:30 IST