మైలవరం నుంచి పెన్నాకు 30 వేల క్యూసెక్కుల నీరు విడుదల

ABN , First Publish Date - 2020-10-02T07:11:18+05:30 IST

మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి తొమ్మిది గేట్ల ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలాశయ ఏఈ గౌతమ్‌రెడ్డి గురువారం తెలిపారు.

మైలవరం నుంచి పెన్నాకు 30 వేల క్యూసెక్కుల నీరు విడుదల

మైలవరం, అక్టోబరు 1 : మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి తొమ్మిది గేట్ల ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జలాశయ ఏఈ గౌతమ్‌రెడ్డి గురువారం తెలిపారు. గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి 28 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటం, వర్షపు నీరు భారీగా చేరుతుండటంతో పెన్నానదికి వదులుతున్నారు. మైలవరం జలాశయం నుంచి ఉదయం నుంచి 8 గేట్ల ద్వారా నీరు విడుదల చేయగా రాత్రికి మరోగేటు ఎత్తి నీటిని పెన్నానదికి వదులుతున్నారు. పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-10-02T07:11:18+05:30 IST