ముంచుతున్న వానలు

ABN , First Publish Date - 2020-10-02T06:54:09+05:30 IST

భారీ వర్షాలు పంట పొలాలతోపాటు, గ్రామాలను, లోతట్టు ప్రాంతాలను ముంచుతున్నాయి. ఎడతెరపిలే ని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

ముంచుతున్న వానలు

ఎర్రగుంట్ల, అక్టోబరు 1: భారీ వర్షాలు పంట పొలాలతోపాటు, గ్రామాలను, లోతట్టు ప్రాంతాలను ముంచుతున్నాయి. ఎడతెరపిలే ని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.  భారీ వర్షాలతో ఎర్రగుంట్ల నగరపంచాయతీ జలదిగ్బందంలో చిక్కుకుంది. బుధవారం రాత్రి 60.8.మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ఎక్కడ చూసినా నీరు నిలిచి జనజీవనం స్తంభించిపోతోంది. రాణీవనాన్ని వర్షం నీరు చుట్టేసింది.


దీంతో ఇక్కడ ప్రజలు అగచాట్లు వర్ణణా తీ తం. ఎంపీడీవో కార్యాలయం ముందు, నాలుగు వీధులు చెరు వులను తలపిస్తున్నాయి. ఇక రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారి పూర్తిగా నీట మునిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌ గత 15రోజులుగా నీటిలో వుంది. ఎర్ర గుంట్ల నడివూరుకు ఎప్పుడు వర్షపు నీరు వచ్చిన సందర్భాలు లేవు. కాని ప్రస్తుతం వారంరోజులుగా ఇళ్లలో నీరు చేరడంతో జనంతీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్‌కు ఇంజిన్‌ ఏర్పాటు చేసి అధికా రులు నీటిని బయటికి పంపుతున్నా నీరు మాత్రం తగ్గడంలేదు. 


పంటలకు తీవ్ర నష్టం

మైలవరం, అక్టోబరు 1 : మండలంలో భారీ వర్షం కురియడంతో  వాగు లు, వంకలు పొంగి  పంట పొలాలపై నీరు నిలిచి పత్తి, మి రప, మినుము, జొన్న తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రామచంద్రాయపల్లిలో పోలు వెంకటన్నకు చెందిన చౌడు మిద్దె భారీ వర్షానికి కూలిపోయింది. మండలంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు చిన్నకొమెర్ల, కల్లుట్ల, వద్దిరాల, తలమంచిప ట్నం, తొర్రివేముల తదితర గ్రామాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.


ఎడతెరపిలేని వర్షాలతో రైతుల్లో ఆందోళన

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 1:  ఎడతెరపి లేని భారీ వర్షాలు కురుస్తుండడంతో పంట పొలాల్లో భారీగా నీరు నిలిచింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని గొరిగెనూరు, ధర్మాపురం, దానవులపాడు, చలివెందుల, దేవగుడి, తదితర గ్రా మాల్లో పంట పొలాల్లో వర్షపునీరు నిలిచింది.  పంట నష్టం భారీగా జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


జమ్మలమడు గు మండలంలోని మోరగుడిలోని మూడు రోడ్ల కూడలి, లక్ష్మీనగర్‌, భాగ్యనగర్‌ కాలనీ తదితర చోట్ల నివాసాల చుట్టూ వర్షపునీరు నిలిచింది.  మోటార్ల ద్వారా తొలగించాలని స్థానికులు కోరుతున్నా రు. అలాగే కన్నెలూరులోని ప్రధాన రోడ్డు , ఎస్సీ కాలనీ రోడ్డు వర్షపునీటితో దారిపొడవునా నిండింది. 


రాజుపాళెం వద్ద ఉధృతంగా కుందూ

రాజుపాళెం, అక్టోబరు 1: భారీ వర్షాలకు కుందూ ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 15 రోజులుగా ప్రతి మూడు రోజులకు ఒకసారి కుందూ ఉధృతంగా ప్రవహించడం, పంట పొలాల మీదుగానే వరదనీరు ప్రవహిస్తుండడంతో రైతులు పూర్తి నిరాశకు గురయ్యారు. ఈ వర్షాలు తగ్గిన వెంటనే పంటను నమోదు చేసి ఆర్థికసాయం అందించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-02T06:54:09+05:30 IST