విమానాల వేళలు..

ABN , First Publish Date - 2020-10-01T06:29:53+05:30 IST

కడప నుంచి విమానాల రాకపోకల వేళలు గురువారం నుంచి మారినట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టరు శివప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విమానాల వేళలు..

కడప, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కడప నుంచి విమానాల రాకపోకల వేళలు గురువారం నుంచి మారినట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టరు శివప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


 మంగళ, గురు, శనివారాల్లో బెల్గాం నుంచి విమానం ప్రతి రోజూ ఉదయం 9.20 గంటలకు బయల్దేరి కడపకు 10.40 నిమిషాలకు చేరుకుంటుంది. కడపలో మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరి సాయంత్రం 3.25కు బెల్గామ్‌కు చేరుకుంటుంది.


 కడప నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరి హైదరాబాదుకు 12.15కు చేరుకుంటుంది. ఇది కూడా మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే. కడపలో 2.20కి బయల్దేరి 3.20కి హైదరాబాదు చేరుకుంటుంది. హైదరాబాదులో 3.55కి బయల్దేరి 5గంటలకు కడప చేరుకుంటుంది.


 ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో చెన్నైలో ఉదయం 10.10 నిమిషాలకు బయల్దేరి కడపకు 11.10కి చేరుకుంటుంది. కడపలో సాయంత్రం 5.25కి బయల్దేరి 6.25కు చెన్నై చేరుకుంటుంది.


 ప్రతి సోమ, బుధ , శుక్ర, ఆదివారాల్లో కడపలో ఉదయం 11.30 నిమిషాలకు బయల్దేరి 12.35కి విజయవాడ చేరుకుంటుంది. విజయవాడలో 12.55కు బయల్దేరి 2గంటలకు కడప చేరుతుంది. 

Updated Date - 2020-10-01T06:29:53+05:30 IST