పీఎంజేవీకే పథకం ద్వారా

ABN , First Publish Date - 2020-09-27T12:29:23+05:30 IST

ప్రధానమంత్రి జనవికాస్‌ కార్యక్రమం (పీఎంజేవీకే) కింద జిల్లాకు పాఠశాలలు, కళాశాలల నిర్మాణానికి రూ.40.68 కోట్లు మంజూరైందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా పేర్కొన్నారు.

పీఎంజేవీకే పథకం ద్వారా

 జిల్లాకు 40.68 కోట్లు మంజూరు

  డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 26: ప్రధానమంత్రి జనవికాస్‌ కార్యక్రమం (పీఎంజేవీకే) కింద జిల్లాకు పాఠశాలలు, కళాశాలల నిర్మాణానికి రూ.40.68 కోట్లు మంజూరైందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా పేర్కొన్నారు. కడపలో ఆయ న తన నివాసంలో శనివారం మైనార్టీ సం క్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జనవికాస్‌ కింద జిల్లాకు రెసిడెన్షియల్‌ స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సద్భావన్‌ మండపాలకు రూ.40.68 కోట్లు మంజూ రైందన్నారు.


ప్రొద్దుటూరు సద్భావన్‌ మండపానికి రూ.50లక్షలు, రెసిడెన్షియల్‌ బాలికల స్కూలు కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.9కోట్లు, మైనార్టీ జూనియర్‌ కళాశాల నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరైందని తెలిపారు. రాయచోటిలో సద్భావన్‌ మండపానికి రూ.40.50 లక్షలు, బాలుర రెసిడెన్షియల్‌ స్కూలు నిర్మాణానికి రూ.9 కోట్లు, అంగన్వాడీ సెంటర్ల నిర్మాణానికి రూ.1,87,058 కోట్లు, బాలికల రెసిడెన్షియల్‌ స్కూలునిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరైందన్నారు.


ప్రొద్దుటూరులో బాలికల రెసిడెన్షియల్‌ స్కూలు కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.9కోట్లు మంజూరైందని తెలిపారు. అలాగే కడప పట్టణంలో ఒక ప్రీమెట్రిక్‌ బాలుర వసతిగృహం, పోస్టుమెట్రిక్‌ బాలుర వసతి గృహం నిర్మాణానికి రూ.5.40 కోట్లు,  వైఎ్‌సఆర్‌ నగర్‌లో ఐదెకరాల్లో రెసిడెన్షియల్‌ బాయ్స్‌ హైస్కూలు నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరైందని, టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-27T12:29:23+05:30 IST