అక్రమ మద్యం, నాటుసారా ధ్వంసం

ABN , First Publish Date - 2020-09-27T12:32:01+05:30 IST

ఽజిల్లాలో పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లు, నాటుసారాను శనివారం ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు నగర శివారు, పులివెందుల రోడ్డులో ధ్వంసం చేశారు.

అక్రమ మద్యం, నాటుసారా ధ్వంసం

కడప (క్రైం), సెప్టెంబరు 26: ఽజిల్లాలో పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లు, నాటుసారాను శనివారం ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు నగర శివారు, పులివెందుల రోడ్డులో ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ, పోలీసు అధికారులు ముమ్మరంగా దాడులు, తనిఖీలు నిర్వహించారు.


ఈ దాడుల్లో పెద్ద ఎత్తున దేశీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. కడప, రాయచోటి, కోడూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, ముద్దనూరు స్టేషన్ల పరిధిలో మొత్తం 51 కేసు ల్లో పట్టుబడి జప్తు అయ్యి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టులో నిర్ధారించిన 341 క్వార్టర్‌ బాటిళ్ల దేశీ అక్రమ మద్యం, 351 లీటర్ల నాటు సారాను నగర శివారు, పులివెందుల రోడ్డులో ధ్వంసం చేశారు.


కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంటు బ్యూరో అదనపు ఎస్పీ చక్రవర్తి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, ఎక్సైజ్‌ సూపరింటెండెం ట్‌లు మునిస్వామి, స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-27T12:32:01+05:30 IST