Abn logo
Sep 22 2021 @ 00:42AM

కడప ఘటన.. పోలీసు వ్యవస్థకు మచ్చ

మాట్లాడుతున్న ప్రభాకరచౌదరి

 - సీఎం స్పందించాలి

- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

: మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి

అనంతపురం వైద్యం సెప్టెంబరు 21: అక్బర్‌బాషా కుటుంబం ఆత్మహత్యకు య త్నించడం పోలీసు వ్యవస్థకు మచ్చ అని అ నంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్ర భాకరచౌదరి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నియోజకవర్గ కార్యాలయంలో ఆ యన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యా లు పెరిగిపోయాయన్నారు. సామాన్య ప్రజలు ఈ దౌర్జన్యాల ను తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. కడపలో అక్బర్‌ బాషాకు చెందిన భూమిని వైసీపీ నేత కబ్జా చేస్తే న్యాయం చే యాల్సిందిపోయి ఆ కుటుంబాన్నే బెదిరించ డం ఏంటని ప్రశ్నించారు. ఇందులో బాధ్యులైన అధికారులందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. పోలీసులు సివిల్‌ పంచాయతీలు చేయకూడదని చట్టంలో ఉన్నా.. పాలకులకు తలొగ్గి వ్య వహరించడం దుర్మార్గమన్నారు. దీనిపై సీఎం జగన స్పందించి, అక్బర్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

జగన పాలనలో ముస్లింలకు రక్షణ కరువు: గౌస్‌మోద్దీన

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 21: జగన పాలనలో రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ కరువైందని గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్‌మోద్దీన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఎన్నికలపుడు ముస్లింలను ఓటు బ్యాంక్‌గా వాడుకున్న జగన ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. తాజాగా కడపలో అ క్బర్‌ బాషా కుటుంబం వైసీపీ నేత దౌర్జన్యాలు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిందన్నారు. ముఖ్యమంత్రి దీనిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. వైసీపీ ఇలాగే వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో ముస్లింలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

కడప ఘటనకు సీఎందే బాధ్యత: టీడీపీ మైనార్టీ సెల్‌

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 21: అక్బర్‌ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ముఖ్యమంత్రి జగనే బాధ్యత వహించాలని టీడీపీ మైనార్టీ సెల్‌ నగర నేతలు డిమాండ్‌ చేశారు. మంగళవారం పార్టీ నగర కార్యాలయంలో మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు గౌస్‌ పీరా, ప్రధాన కార్యదర్శి ముక్తియార్‌ మాట్లాడారు. తమకు న్యాయం చేయాలనీ, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని స్వయంగా ముఖ్యమంత్రికే సెల్ఫీ ద్వారా అక్బర్‌ కుటుంబం వేడుకుందన్నారు. అయినా అధికారులు న్యాయం చేయకపోవడంతో ఆ కుటుంబం ఆత్మహత్య కు యత్నించాల్సి వచ్చిందన్నారు. సమావేశంలో వడ్డేమురళి, బండారు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

మైనార్టీల ఆస్తుల ఆక్రమణ సిగ్గుచేటు: ఐఎంఎం 

అనంతపురం టౌన, సెప్టెంబరు 21: మైనార్టీల ఆస్తులను దౌర్జన్యంగా ఆక్రమించడం సిగ్గుచేటని ఇండియన ముస్లిం మైనార్టీ ఆర్గనైజేషన (ఐఎంఎం) రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక ఐఎంఎం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బంధువే తమ స్థలాన్ని ఆక్రమించారంటూ కర్నూలు జిల్లా చాగలమర్రి వాసి అక్బర్‌.. కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహ త్యకు యత్నించడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికైనా అక్బర్‌ కుటుంబానికి న్యా యం చేయాలనీ, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.