‘జగన్మోహన్ రెడ్డి కొంప కూల్చాలంటే కొడాలి నాని మాత్రమే చాలు’

ABN , First Publish Date - 2022-01-25T20:50:31+05:30 IST

సీఎం జగన్ కొంప కూల్చాలంటే కొడాలి నాని మాత్రమే చాలని టీడీపీ నేత లింగారెడ్డి అన్నారు.

‘జగన్మోహన్ రెడ్డి కొంప కూల్చాలంటే  కొడాలి నాని మాత్రమే చాలు’

కడప: మంత్రి కొడాలి నానిపై కడప టీడీపీ నేతలు లింగారెడ్డి, నారాయణరెడ్డి, శివనాధ రెడ్డిలు మండిపడ్డారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కొంప కూల్చాలంటే  కొడాలి నాని మాత్రమే చాలని అన్నారు. మంత్రి తన భాషను మార్చుకోవాలని సూచించారు. అభం శుభం ఎరుగని చంద్రబాబు తండ్రిని నోటికొచ్చినట్లు మాట్లాడడం ధారుణమన్నారు. మంత్రి అంటే హుందాగా ఉండాలని, వినకూడని, రాయ కూడని భాషలో ఇష్టం వచ్చి నట్లు మాట్లాడటం సరికాదన్నారు. పోయేకాలం వస్తే ఇలాగే వ్యవహరిస్తారన్నారు. కొడాలినానిని అదుపుచేయడంలో సిఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి దగ్గరుండి కొడాలి నానితో ఇలా మాట్లాడిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. టీడీపీ నేతలకు గన్ మెన్లను తొలగించారని, మళ్లీ తెలుగు దేశం ప్రభుత్వం వస్తే వారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలని లింగారెడ్డి అన్నారు.

Updated Date - 2022-01-25T20:50:31+05:30 IST