కడప: జిల్లా వద్ద టీడీపీ(TDP) నేతలు ఆందోళనకు దిగారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉపసంహరించాలంటూ నిరసన చేపట్టారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టర్కు టీడీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం టెట్ పరీక్ష ఉపసంహరించుకోకపోతే ఇడుపులపాయను ముట్టడిస్తామని హెచ్చరించారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో సీఎం జగన్ జిల్లా పర్యటనను అడ్డుకుంటామని టీడీపీ నేతలు తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి