అమరావతి: వ్యవసాయ భూములపై కడప కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దళిత, బలహీన, నిరుపేదలకు కేటాయించిన వ్యవసాయ భూముల నుంచి బలవంతంగా తొలగించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటున్న వందల కుటుంబాలను బలవంతంగా అధికారులు ఖాళీ చేయిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. బాధిత కుటుంబాలను వ్యవసాయ భూముల నుంచి తొలగించకుండా హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను హైకోర్టు మూడు వారాల పాటు వాయిదా వేసింది.