రూ.850 కోట్లతో కడప నగరాభివృద్ధి

ABN , First Publish Date - 2021-06-22T06:57:07+05:30 IST

కడప నగరాన్ని రూ.850 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మేయరు సురే్‌షబాబు తెలిపారు. మేయరు సురే్‌షబాబు అధ్యక్షతన కడప నగర పాలకసంస్థ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది.

రూ.850 కోట్లతో కడప నగరాభివృద్ధి
మాట్లాడుతున్న మేయర్‌ సురేష్‌బాబు, చిత్రంలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

సంపూర్ణ పారిశుధ్యం, ప్లాస్టిక్‌ నిషేధం లక్ష్యం

మొదటి విడతలోనే కడపవాసులకు ఇళ్లు

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయరు సురే్‌షబాబు

కడప(ఎర్రముక్కపల్లె), జూన 21: కడప నగరాన్ని రూ.850 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మేయరు సురే్‌షబాబు తెలిపారు. మేయరు సురే్‌షబాబు అధ్యక్షతన కడప నగర పాలకసంస్థ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకవర్గం ఏర్పడి మూడు నెలలు అవుతోందన్నారు. గతంలో మేయరుగా ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి కడప అభివృద్ధికి రూ.850 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. గతం కన్నా మెరుగైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. సంపూర్ణ పారిశుధ్యం, ప్లాస్టిక్‌ నిషేధం పాలన కొనసాగుతుందని, మొదటి విడతలోనే కడప నగర వాసులకు ఇళ్లు పూర్తి చేయిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం అజెండాలో ఉన్న 31 తీర్మానాలు ప్రవేశపెట్టారు. సభ్యులు వాటికి ఆమోదముద్ర వేశారు.


సమస్యలపై గళం విప్పిన కార్పొరేటర్లు

నగరంలో సమస్యలపై కార్పొరేటర్లు గళం విప్పారు. కొత్తగా వసూలు చేయాలని నిర్ణయించిన యూజర్‌ చార్జీలు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, పన్నులు, డ్రైనేజీ సమస్యలపై అధికారులను నిలదీశారు. బుగ్గవంక సుందరీకరణలో భాగంగా ప్రొటెక్షన వాల్‌ నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రొటెక్షన వాల్‌ నిర్మాణం పూర్తి కాకుంటే మళ్లీ వరద వస్తే గృహాలపైకి వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కరోనా కారణంగా కొత్తగా నియామకాలు చేపట్టిన 175 మంది అవుట్‌ సోర్సింగ్‌ నియామకాలపై విచారణ జరపాలని కార్పొరేటర్లు పాకా సురేష్‌, మగ్బుల్‌బాషా, షఫి, షంషీర్‌లు డిమాండ్‌ చేశారు. ఏజన్సీలు అభ్యర్థుల నుంచి 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు లంచం తీసుకున్నట్లు అభ్యర్థులు తెలిపినట్లు తెలిపారు. తక్షణం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంలో ఏజన్సీలు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు నిజమైతే వారి ఏజన్సీలు రద్దు చేస్తామని అలాగే వారిని బ్లాక్‌లిస్టులో పెడతామని డిప్యూటీ సీఎం, మేయర్‌ తెలిపారు. దీనిపై కార్పొరేటర్లతో కూడిన కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కరోనాతో మరణించిన 22వ డివిజన కార్పొరేటరు బోలా పద్మావతి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. నగరంలో బోలా పద్మావతి పేరు మీద ఒక వీధికి పేరు ఏర్పాటు చేయాలని, దానికి సభ్యులందరూ ఆమోదముద్ర  వేయాలని మేయర్‌ కోరారు. సమావేశంలో ఇనఛార్జ్‌ కమిషనరు రమణారెడ్డి, డిప్యూటీ కమిషనరు శివారెడ్డి, అసిస్టెంట్‌ కమిషనరు సుబ్బారావు, ఎంఎస్‌వో శ్రీనివాసులు, మేనేజరు హిదయతుల్లాతో పాటు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T06:57:07+05:30 IST