కడప: పోలీసుల ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. బిమఠం ఏఎస్ఐనంటూ.. బంధువులు హస్పిటల్‌లో ఉన్నారంటూ గొల్లపల్లెకు చెందిన జగదీశ్వరి వద్ద సైబర్ నేరగాళ్లు రూ.40 వేలు దండుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో నేరగాళ్లను మీడియా ఎదుట హాజరుపరిచిన ఏఎస్పీ వరప్రసాద్ వివరాలను వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎవరికీ షేర్ చేయవద్దని ఏఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి