Kadapa: రాజంపేటలో వరదలు తగ్గుముఖం

ABN , First Publish Date - 2021-11-20T14:27:32+05:30 IST

జిల్లాలోని రాజంపేట ప్రాంతంలో వరదలు తగ్గుముఖం పట్టాయి. నేడు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు.

Kadapa: రాజంపేటలో వరదలు తగ్గుముఖం

కడప: జిల్లాలోని రాజంపేట ప్రాంతంలో వరదలు తగ్గుముఖం పట్టాయి. నేడు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. చెయ్యేరునది వరదల్లో 12 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. చెయ్యేరునది పరీవాహ ప్రాంత గ్రామాల్లో 60 మందికి పైన గల్లంతు అయినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. నదిపక్కన గ్రామాల్లో కలిగిన భారీ నష్టం అంచనాకు అందని  పరిస్థితి నెలకొంది. పశువులు, వాహనాలు నదిలో కొట్టుకుపోయాయి. చొప్పావారిపల్లె హైవే రహదారిపై నిన్న బస్సులు చిక్కుకుపోయాయి. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, రహదారి మరమ్మత్తు పనులను అధికారులు ప్రారంభించారు. 

Updated Date - 2021-11-20T14:27:32+05:30 IST