Kadapa: బండలాగుడు పోటీలో కిందపడ్డ ఎమ్మెల్యే ప్రసాద్

ABN , First Publish Date - 2022-04-12T16:34:56+05:30 IST

జిల్లాలోని ప్రొద్దుటూరు దొరసానిపల్లెలో బండలాగుడు పోటీలలో అపశృతి చోటు చేసుకుంది.

Kadapa: బండలాగుడు పోటీలో కిందపడ్డ ఎమ్మెల్యే ప్రసాద్

కడప: జిల్లాలోని ప్రొద్దుటూరు దొరసానిపల్లెలో బండలాగుడు పోటీలలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. అయితే పోటీని ప్రారంభించే సమయంలోఎద్దులు ఒక్కసారిగా వేగంగా కదలడంతో ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి కిందపడ్డారు. దీంతో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2022-04-12T16:34:56+05:30 IST