Kadapa: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు యత్నం...ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-04-12T14:03:06+05:30 IST

జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో అధికారిక అనుమతులు లేకుండా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కొందరు వ్యక్తులు యత్నించారు.

Kadapa: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు యత్నం...ఉద్రిక్తత

కడప: జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో అధికారిక అనుమతులు లేకుండా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కొందరు వ్యక్తులు యత్నించారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలుమార్లు విగ్రహం ఏర్పాటు చేయడానికి విఫలయత్నం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠం నుండి బ్రహ్మంసాగర్‌కు వెళ్ళే రహదారిలో ఒక సామాజిక వర్గం అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించింది. ఎమ్మెల్యే, ఎంపీపీ అండదండలున్నాయని, అధికారుల అనుమతులు అక్కరలేదంటూ స్థానికులను బేఖాతరు చేయడంతో జనం మండిపడ్డారు. అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై  పోలీసులు ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-04-12T14:03:06+05:30 IST