ప్రేమే గెలిచింది...

ABN , First Publish Date - 2020-09-26T23:14:42+05:30 IST

ప్రేమే గెలిచింది...

ప్రేమే గెలిచింది...

కేవీపల్లె: ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకోగా అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన ప్రేమికుడు ఆత్మహత్యకు యత్నించిన సం గతి తెలిసిందే. ప్రేమ జంటను విడదీయడంపై గురువారం ఆం ధ్రజ్యోతిలో కథనం రావడం తో కడప జిల్లా కోడూరు పోలీసులు స్పందించారు. కొన్ని గంటల వ్యవధిలోనే భార్యను తిరిగి భర్తకు అప్పగించారు. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం ఎంవీపల్లె పంచాయతీ ఎగువమేకలవారిపల్లెలో దళిత కుటుంబానికి చెందిన రామచంద్ర కుమారుడు నాగభూషణ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం వెంకటరెడ్డిపల్లెకు చెందిన మల్లికార్జునరెడ్డి కుమార్తె సుకన్యారెడ్డి తిరుపతిలో చదువుకుంటున్న సమయంలో నాగభూషణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈనెల 14వ తేదీ నాగభూషణ గ్రామస్తుల సహకారంతో కేవీపల్లె మండలం చీనేపల్లె ఆలయంలో సుకన్యను వివాహం చేసుకున్నాడు. అయితే సుకన్య తల్లిదండ్రులు తమ కుమార్తెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లడంతో నాగభూషణ చెరు వులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో కథ నం ప్రచురితం కావడంతో కోడూరు సీఐ ఆనందరావ్‌, ఎస్‌ఐ పెద్దఓబన్న స్పందించారు. సుకన్యను  శుక్రవారం కోడూరు కోర్టు వద్దకు తీసుకువచ్చి మరోమారు నూతన వధూవరులనుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. కేవీపల్లె వైసీపీ నాయకులు గజ్జెలశీన్‌రెడ్డి, శృతిరెడ్డి, గ్రామస్తుల సమక్షంలో సుకన్యను భర్త నాగభూషణకు అప్పగించారు. అనంతరం నూతన వధూ వరులు కేవీపల్లె పోలీస్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ రామ్మోహన్‌కు జరిగిన విషయం తెలిపి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈసందర్భంగా నూతన దంపతులు మాట్లాడుతూ తమను విడదీయాలని చూసినా చివరికి ప్రేమే గెలిచిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-26T23:14:42+05:30 IST