ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో ముమ్మర విచారణ

ABN , First Publish Date - 2020-09-26T23:14:10+05:30 IST

ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో ముమ్మర విచారణ

ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో ముమ్మర విచారణ

ప్రొద్దుటూరు క్రైం: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం ఆర్‌ఎఫ్‌) ఫేక్‌ చెక్కుల వ్యవహారంలో డీఎస్పీ సుధాకర్‌ లోసారి నేతృత్వం లో సీఐలు విశ్వనాధరెడ్డి, నాగరాజు, సుబ్బారావు, నరసింహరెడ్డిలు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే అధికారులు జరిపిన విచారణలో కొన్ని కొత్త కోణాలు వెలుగు చూసినట్లు సమాచారం. ఈ క్రమంలో కేసును త్వరితగతిన చేధించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కాగా ఈ నకిలీ చెక్కుల వ్యవహారంలో సంబంధాలు ఉన్నాయ న్న సమాచారంతో పక్క మండలానికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. సీఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కుల రూపకల్పన పాత్రదారులపై కూడా పోలీసు అధికారులు దృష్టి సారించారని, సిబ్బందిని పక్క రాష్ట్రాలకు పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ పేక్‌ చెక్‌ల వ్యవహారంలో ఇప్పటికే కొంత మేరకు పురోగతి సాధించినట్లుగా సమాచారం.


Updated Date - 2020-09-26T23:14:10+05:30 IST