కడప: తండ్రి ఆత్మహత్య...తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు కూడా...

ABN , First Publish Date - 2020-08-08T16:37:27+05:30 IST

జిల్లాలోని ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సమస్యలతో తండ్రి బాబురెడ్డి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కడప: తండ్రి ఆత్మహత్య...తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు కూడా...

కడప: జిల్లాలోని ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సమస్యలతో తండ్రి బాబురెడ్డి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తండ్రి మరణవార్త తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు కూడా రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్ద కూతురు శ్వేతను భర్త వేధించడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాబురెడ్డి సెల్ఫీ వీడియో తీశాడు. అక్కతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థి సాయి ఆత్మహత్య చేసుకుంది. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు రాణి పేట మధ్యగల రైల్వే ట్రాక్‌పైన ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతితో ప్రొద్దుటూరులో విషాదఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2020-08-08T16:37:27+05:30 IST