కరోనాతో బెరైటీస్‌ తవ్వకాల నిలిపివేత

ABN , First Publish Date - 2020-08-02T11:14:06+05:30 IST

కరోనాతో బెరైటీస్‌ తవ్వకాల నిలిపివేత

కరోనాతో బెరైటీస్‌ తవ్వకాల నిలిపివేత

ఓబులవారిపల్లె, ఆగస్టు1: కరోనా కారణంగా కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట బెరైటీస్‌ గనుల తవ్వకాల పనులు శనివారం తాత్కాలికంగా నిలిపివేశారు. ఏపీఎండీసీ మంగంపేట శాఖలో పనిచేసే కార్మికుల్లో 10 మందికి కరోనా పాజిటివ్‌ నమోదుకావడం కలకలం రేపింది. మరికొందరిలో కరోనా లక్షణాలు కనపడటంతో కార్మికుల్లో భయాందోళనలు మొదలయ్యారు. ఈ విషయాన్ని మంగంపేట శాఖ జనరల్‌ మేనేజర్‌ సుదర్శన్‌రెడ్డి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. యాజమాన్యం ఆదేశాల మేరకు బెరైటీస్‌ గనుల్లో డీవాటరింగ్‌ పనులు మినహాయించి అన్ని విభాగాల పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. పరిపాలనా భవనాలు మొదలుకొని అన్ని విభాగాల్లో శానిటైజర్‌ పనులు చేపట్టారు. ఏపీఎండీసీ యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలని కార్మిక సంఘాలు, గ్రామపెద్దలు కోరుతున్నారు.

Updated Date - 2020-08-02T11:14:06+05:30 IST