Abn logo
Aug 22 2021 @ 12:32PM

వివేకా హత్య కేసులో 76వ రోజుకు సీబీఐ విచారణ

కడప:  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 76 వ రోజు  సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ సాగుతోంది. ఈరోజు పులివెందులకు చెందిన మున్సిపల్ ఉద్యోగస్తులు గంగులయ్య, సురేష్, కడపకు చెందిన ప్రైవేటు ఉద్యోగి జగదీశ్వర రావు విచారణకు హాజరయ్యారు. మరికొంత మంది అనుమానితులను విచారించే అవకాశం ఉంది.