Abn logo
Jul 21 2021 @ 11:33AM

Kadapa: పోలీస్‌కంట్రోల్ రూంలో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య

కడప: నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్‌లో విజయకుమార్ అనే హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విజయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరుస అనారోగ్య సమస్యల వల్లే మనస్ధాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.