కడపలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN , First Publish Date - 2021-07-15T20:23:39+05:30 IST

కడప:నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

కడపలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

కడప: నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాలకుల స్వార్థం... అధికారుల నిర్లక్ష్యం.. కడప నగర ప్రజలకు శాపాలుగా మారాయి. భారీ వర్షాలు వస్తే కడప నగరం జలమయం అవుతుంది. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారిపై నాలుగు అడుగుల నీరు నిలిచింది. కొంచెం వర్షం వచ్చినా.. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర్ కాలనీ, గంజికుండా కాలనీ, ముత్యుంజయకుంట, భరత్‌నగర్, చిన్న చౌక్ ప్రాంతాలు జలమయమయ్యాయి. సమస్యలపై పాలకులు, అధికారులు దృష్టిపెట్టడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.

Updated Date - 2021-07-15T20:23:39+05:30 IST