విధుల నుంచి మైదుకూరు సీఐ తొలగింపు

ABN , First Publish Date - 2021-09-12T00:41:12+05:30 IST

అక్బర్‌ బాషా భూ వివాదం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైదుకూరు సీఐ

విధుల నుంచి మైదుకూరు సీఐ తొలగింపు

కడప: అక్బర్‌ బాషా భూ వివాదం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైదుకూరు సీఐ కొండారెడ్డిని రెండు రోజుల పాటు విధుల నుంచి తొలగిస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. విచారణ సందర్బంగా సీఐ దురుసుగా స్పందించినట్లు అక్బర్‌బాషా ఆరోపణలు చేశారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ అరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామన్నారు. అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించామన్నారు. రెండు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదేశించామన్నారు. సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని, సీఎం, డీజీపీలు స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని అదేశించారని ఆయన పేర్కొన్నారు.


భూ వివాదానికి సంబంధించి ఈ నెల 9న అక్బర్‌బాషా స్పందనలో ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు మేరకు విచారిం చాలని సీఐ, డీఎస్పీ కార్యాలయానికి పంపించామని ఆయన తెలిపారు. నిన్న మైదుకూరు సీఐ కొండారెడ్డి విచారించారన్నారు. విచారణ సందర్బంగా సీఐ దురుసుగా స్పందించినట్లు అక్బర్‌బాషా ఆరోపణలు చేశారన్నారు. ఈ అరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామన్నారు. 

Updated Date - 2021-09-12T00:41:12+05:30 IST