Abn logo
Aug 20 2021 @ 07:44AM

Kabul: విమానాశ్రయంలో 5,200 మంది యూఎస్ ఆర్మీతో భద్రత

కాబూల్ : అఫ్గానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,200 మంది అమెరికా సైనికులను మోహరించామని పెంటగాన్ తాజాగా వెల్లడించింది. కాబూల్ విమానాశ్రయం అమెరికా సైనికుల పహరాలో సురక్షితంగా ఉందని అమెరికా ఆర్మీ మేజర్ జనరల్ విలియం టేలర్ చెప్పారు. విమానయాన కార్యకలాపాల కోసం కాబూల్ విమానాశ్రయాన్ని తెరచి ఉంచామని పెంటగాన్ పేర్కొంది. ఆగస్టు 14వతేదీ నుంచి ఇప్పటివరకు 7వేలమంది నిర్వాసితులను సురక్షితంగా తరలించామని మేజర్ జనరల్ విలియం టేలర్ చెప్పారు. అమెరికన్ల భద్రత కోసం యూఎస్ ఆర్మీ బలగాలు పనిచేస్తున్నాయని, వీలైనంత త్వరగా వారిని సురక్షితంగా తరలిస్తామని టేలర్ వివరించారు.కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సురక్షితంగా ఉంచడమే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని పెంటగాన్ తెలిపింది.