జాతీయ స్థాయి కబడ్డీ విజేత ఢిల్లీ

ABN , First Publish Date - 2022-01-19T05:35:20+05:30 IST

రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో స్త్రీ, పురుషుల విభాగాల్లో కూడా ఢిల్లీ జట్లు విజేతగా నిలిచాయి.

జాతీయ స్థాయి కబడ్డీ విజేత ఢిల్లీ
విజేతలకు షీల్డ్‌ అందజేస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

నరసాపురం టౌన్‌, జనవరి 18: రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో స్త్రీ, పురుషుల విభాగాల్లో కూడా ఢిల్లీ జట్లు విజేతగా నిలిచాయి. మంగళవారం రాత్రి హోరా హోరీగా సాగిన మహిళ ఫైనల్స్‌ పోరులో స్పోర్ట్స్‌ క్లబ్‌ ఢిల్లీ ప్రథమ, చండీగర్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి. హిమా చల్‌ ప్రదేశ్‌ తృతీయ, ఆంధ్ర జట్టు నాలుగో స్థానంలో ఉన్నాయి. పురుషుల విభా గంలో నార్తన్‌ రైల్వే ఢిల్లీ ప్రథమ, హర్యానా ద్వితీయ, హైదరాబాద్‌ ఆర్మీ తృతీయ, చండీఘర్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. విజేతలకు రూ.లక్ష, రూ.75 వేలు తృతీయ రూ.50 వేలు, రూ.25 వేలు నగదు బహుమతి, షీల్డ్‌ అందజేశారు. 

క్రీడల్లో రాణించే ఆటగాళ్లకు మంచి భవిష్యత్‌ ఉందని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. కబడ్డీ పోటీల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. క్రీడా పోటీలతో దేశ సమగ్రత పెంపొందు తుందన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ గ్రామీణ క్రీడ కబడ్డీని ప్రోత్సాహించలన్న ఉద్దేశ్యంతో 29 ఏళ్లుగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, పోటీల కన్వీనర్‌ కొత్తపల్లి జానకిరామ్‌, కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి యలమంచిలి శివాజీ, ఎంబీసీ చైర్మన్‌ పెండ్ర వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:35:20+05:30 IST