Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కబాబ్స్‌

కబాబ్స్‌

కావలసినవి: ఖీమా - 150గ్రాములు, చికెన్‌ బోన్‌లెస్‌ - 100గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒకటీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, ఆమ్‌చూర్‌ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, శొంఠిపొడి - పావు టీస్పూన్‌, నూనె - సరిపడా, జీడిపప్పు పేస్టు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, క్రీమ్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌,  శనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కోడిగుడ్డు పచ్చసొన - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - గార్నిష్‌ కోసం ఒకకట్ట.


తయారీ విధానం: ఒక బౌల్‌లో ఖీమా, చికెన్‌ వేసి బాగా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, మిరియాల పొడి, ఆమ్‌చూర్‌పౌడర్‌, శొంఠిపొడి, జీడిపప్పు పేస్టు, క్రీమ్‌, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి.తరువాత శనగపిండి, కోడిగుడ్డు వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఫ్రిజ్‌లో ఒక గంట పాటు పెట్టాలి.ఇప్పుడు మిశ్రమాన్ని బయటకు తీసి కొద్దికొద్దిగా తీసుకుంటూ పుల్లలకు గుచ్చాలి. నూనె వేసుకుంటూ గ్రిల్‌ చేసుకోవాలి. సర్వింగ్‌ ప్లేట్‌లోకి మార్చుకుని ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని కబాబ్స్‌ సర్వ్‌ చేసుకోవాలి.

మటన్‌ రోస్ట్‌మటన్‌ రోస్ట్‌మటన్‌ కట్‌లెట్స్‌మటన్‌ కట్‌లెట్స్‌వర్క్యూ లుక్మేవర్క్యూ లుక్మేటర్పెండో పెప్పర్టర్పెండో పెప్పర్భార్వాన్‌ టంగ్డిభార్వాన్‌ టంగ్డిగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాగిలౌటి కబాబ్‌ విత్‌ ఉల్టా తవ్వా కా పరోటాఅన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌అన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌టిక్కాటిక్కామంచూరియామంచూరియాఫిష్‌ కేక్‌ఫిష్‌ కేక్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.