వైభవంగా కార్తీక దీపోత్సవం

ABN , First Publish Date - 2020-11-30T06:16:44+05:30 IST

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి పలు దే వాలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వై భవంగా నిర్వహించారు.

వైభవంగా కార్తీక దీపోత్సవం
కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో..

ఒంగోలు(కల్చరల్‌), నవంబరు 29 : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి పలు దే వాలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వై భవంగా నిర్వహించారు. ఒంగోలులోని కేశవస్వా మి పేట శ్రీగంగాఅన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం, సంతపేట సాయిబాబా మం దిరం, కొత్తపట్నం బస్టాండు శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, రంగారాయుడు చెరువు దగ్గరున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం తదితర దేవాలయాల్లో భక్తులు దీపా లను వెలిగించి తులసి, ఉసిరిచెట్టుకు పూజలు నిర్వహించారు.  


 కనులపండువగా లక్ష దీపోత్సవం


అద్దంకి: శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి లక్ష దీ పోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ  ఎ మ్మెల్యే బాచిన చెంచుగరటయ్య దంపతులు,  సీ ఐ ఆంజనేయరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఏసీ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు హరిశంకరావధాని, పూజారులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. 

మేదరమెట్ల : కార్తీక పౌర్ణమి పర్వదినం సం దర్భంగా ఆదివారం దైవాలరావూరు ఉమామహే శ్వర ఆలయంలో శరవణశర్మ ఆధ్వర్యంలో ప్ర త్యేక పూజలు జరిగాయి. 

చీమకుర్తి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పు రస్కరించుకొని ఆదివారం రాత్రి హరిహరక్షేత్రం లో జ్వాలాతోరణం పూజను కనులపండవగా నిర్వహించారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, సతీమణి లక్ష్మీపద్మావతి కుటుంబ సభ్యులతో క లిసి విశేష పూజలు చేశారు.  






Updated Date - 2020-11-30T06:16:44+05:30 IST