కేఏ పాల్ హౌస్ అరెస్టు

ABN , First Publish Date - 2022-05-03T21:34:42+05:30 IST

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

కేఏ పాల్ హౌస్ అరెస్టు

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు డీసీపీ కార్యాలయానికి వెళ్లాలని పాల్ భావించారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాకు బయలుదేరారు. సిరిసిల్ల వెళ్తున్న పాల్‌ను సిద్దిపేట సరిహద్దులో టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పాల్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. కేఏ పాల్ కారు దిగి టీఆర్‌ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్త ఆయనపై చేయి చేసుకున్నారు. పాల్‌పై దాడి చేయడంతో ఆయన అనుచరులు నిరసనకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. దూకుడుగా వస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. పాల్‌ను సిరిసిల్ల జిల్లాకు రాకుండా పోలీసులు హైదరాబాద్‌కు వెనక్కి పంపారు. పాల్‌పై చేయిచేసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్‌పై దాడి చేసిన వ్యక్తిని తంగాళ్లపల్లి మండలం జిల్లెళ్లకు చెందిన అనిల్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ యూత్‌ నాయకుడిగా, నేరెళ్ల సింగిల్ విండో డైరెక్టర్‌గా అనిల్‌రెడ్డి ఉన్నారు.

Read more