Delhi: దేశాన్ని, రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారు: KA Paul

ABN , First Publish Date - 2022-07-14T21:04:54+05:30 IST

దేశాన్ని, రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారని కెఏ పాల్ విమర్శించారు.

Delhi: దేశాన్ని, రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారు: KA Paul

న్యూఢిల్లీ (Delhi): దేశాన్ని, రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారని, బీజేపీ (BJP) చేసిన తప్పుడు సర్వేలపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ (KA Paul) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ (TRS), 36 శాతం, బీజేపీ (BJP) 30 శాతం ఓట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సర్వే సంస్థ ‘ఆరా’ అధినేత మస్తాన్‌‌పై హైకోర్టులో పిటిషన్ వేస్తున్నామని చెప్పారు. మహారాష్ట్రలో ఈడీని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేసిందని ఆరోపించారు.


ఈవీఎంలను బ్యాన్ చేసేందుకు పోరాటం చేస్తానని, 18 ప్రధాన పార్టీల నేతలను కలుస్తానని కేఏ పాల్ చెప్పారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీం అని అన్నారు. కోర్టులు ఇస్తున్న కొన్ని తీర్పులు ఊహాజనీతంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు జడ్జికి రాజ్యసభ ఇచ్చారని, పోస్టులకు, పొజిషన్లకు జడ్జీలు భయపడుతున్నారని అన్నారు. ఆరా మస్తాన్ పిచ్చి పిచ్చి సర్వేలు చేస్తే ఊర్లలో తిరగనివ్వరన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు అన్ని రంగాల్లో విఫలమయ్యారన్నారు. ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతూ.. ఆరా మస్తాన్ రిపోర్ట్‌ను చించేశారు. హైదరాబాద్‌లో బీజేపీ సమావేశాలకు సుమారు రూ. 2 వేల కోట్ల మేర ఖర్చు చేశారన్నారు. బండి సంజయ్ మోదీని దేవుడని అనడం ఏంటని కేఏ పాల్ ప్రశ్నించారు.

Updated Date - 2022-07-14T21:04:54+05:30 IST