Oct 27 2021 @ 15:13PM

‘బ్యాక్ డోర్’కు విజయం తధ్యం: దర్శకేంద్రుడు

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ నుండి ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ట్రైలర్ విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘బ్యాక్ డోర్’ టీజర్‌కి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్.. అన్నారు.

లెజండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు తమ చిత్ర ట్రైలర్ విడుదల చేసి, బెస్ట్ విషెస్ తెలపడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడితో పాటు నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.