Abn logo
Oct 30 2020 @ 19:42PM

జమ్మూ కశ్మీర్ ఎన్నికల కమిషనర్‌గా కేకే శర్మ

Kaakateeya

శ్రీనగర్: విశ్రాంత ఐఏఎస్ అధికారి కేకే శర్మ జమ్మూ కశ్మీర్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సలహాదారు పదవికి రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఈ మేరకు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన శర్మ.. 1983 బ్యాచ్‌ గోవా, మిజోరాం కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్‌  ఐఏఎస్ అధికారి. గతేడాది నవంబర్‌లో ఆయన జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారుగా నియమితులయ్యారు. 30 ఏళ్ల తన సర్వీసులో ఢిల్లీ, గోవాలకు చీఫ్ సెక్రటరీ సహా పలు కీలక పదవుల్లో కేకే శర్మ పనిచేశారు. పదవీ విరమణకు ముందు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా సేవలు అందించారు. 

Advertisement
Advertisement