ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో జ్యోతిరాదిత్యకు స్థానం

ABN , First Publish Date - 2021-07-26T04:50:45+05:30 IST

గణిత వర్గాల వ్యతిరేక దిశ పునశ్చరణలో సంతకవిటి మండలం అప్పల అగ్రహారం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి బొడ్డేపల్లి జ్యోతిరాదిత్య ప్రతిభ కనబరి చాడు. డిగ్రీ, పీజీ విద్యార్థులు గణిత వర్గాలను ఉద్యోగ పరీక్షల కోసం గుర్తుపెట్టు కునేందుకు చా లా సమయం పడుతుంది. అటువంటి తరుణంలో జోతి రాదిత్య ఒకటి నుంచి 50 సంఖ్యల వర్గాలను రివర్స్‌ ఆర్డర్‌లో ఒక నిమి షం 54 సెకెండ్లలో చెప్పి రికార్డు సృష్టించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికా ర్డ్స్‌లో స్ధానం సంపాదించాడు.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో జ్యోతిరాదిత్యకు స్థానం
ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌, మెడల్‌ను చూపుతున్న జ్యోతిరాదిత్య

వ్యతిరేక దిశ  అంకెల పునశ్చరణలో ప్రతిభ

 సంతకవిటి, జూలై 25: గణిత వర్గాల వ్యతిరేక దిశ పునశ్చరణలో సంతకవిటి మండలం అప్పల అగ్రహారం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి బొడ్డేపల్లి జ్యోతిరాదిత్య ప్రతిభ కనబరి చాడు.  డిగ్రీ, పీజీ విద్యార్థులు గణిత వర్గాలను ఉద్యోగ పరీక్షల కోసం గుర్తుపెట్టు కునేందుకు చా లా సమయం పడుతుంది. అటువంటి తరుణంలో జోతి రాదిత్య ఒకటి నుంచి 50 సంఖ్యల వర్గాలను రివర్స్‌ ఆర్డర్‌లో ఒక నిమి షం 54 సెకెండ్లలో చెప్పి రికార్డు సృష్టించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికా ర్డ్స్‌లో స్ధానం సంపాదించాడు. మామూలు గా 625 వర్గాన్ని వ్యతిరేక దిశలో చెప్పాలని ప్రశ్నించినప్పుడు.. 526 అని ఠక్కున చెప్పే   ఘనతను జ్యోతిరాదిత్య పొందాడు. ఈవిధంగా 1-50 సంఖ్యల వర్గాన్ని ఒక నిమిషం 54 సెకెండ్లలో చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. తొలి ప్రయత్నంలోనే ఈ ప్రతిభ కనబరిచాడు. నేషనల్‌ మెమరీ చాంపియన్‌, మెమరీ ట్రైనర్‌ బొడ్డేపల్లి నరేష్‌కుమార్‌ వద్ద జ్యోతిరాదిత్య తర్ఫీదు పొందాడు. ఈసంద ర్భంగా నరేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇటువంటి స్కిల్స్‌ నేర్చుకోవడం ద్వారా ఆత్మ విశ్వాసం పెంపొందించుకో వచ్చన్నారు. గణిత మంటే భయం తొలగిం చ వచ్చన్నారు. జ్యోతిరాదిత్య తండ్రి బొడ్డేపల్లి సురేష్‌కుమార్‌ అప్పల అగ్రహారంలో నివాస ముంటున్నారు. జ్యోతి రాదిత్య గ్రామంలోని ప్రైవేట్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు.  

 

Updated Date - 2021-07-26T04:50:45+05:30 IST